రైజింగ్ స్టార్ సింధు మెగాఫైనల్‌కు సిద్ధo..
- August 19, 2016
రైజింగ్ స్టార్ సింధు మెగాఫైనల్‌కు సిద్ధమైంది. వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్‌తో తెలుగుతేజం తలపడనుంది. రియోలో గోల్డ్‌మెడల్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించాలనుకుంటోంది సింధు. రియో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం సింధు అంచనాలు అందుకుంటోంది. ఉమెన్స్ సింగిల్స్‌లో వరుస విజయాలతో ఫైనల్ చేసింది. గోల్డ్‌మెడల్‌కు విజయం దూరంలో ఉంది. ఫైనల్‌లో స్పెయిన్ షెట్లర్ కరోలినా మారిన్‌తో సింధు తలపడబోతోంది.
ఒలింపిక్స్ ఆరంభం నుంచి దూకుడు మీదున్న తెలుగు రాకెట్ ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. సూపర్ ఫామ్‌తో వరల్డ్ నెంబర్‌వన్‌కు షాకివ్వాలనుకుంటోంది. ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలో దిగిన సింధు ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. తుదిపోరులోనూ ఏ మాత్రం ఒత్తిడికి లోనవకుండా కూల్‌గా ఆడాలని ప్లాన్ చేసుకుంది.
రికార్డులు మాత్రం మారిన్‌కు ఫేవర్‌గా ఉన్నాయి. ఇద్దరూ ఏడుసార్లు ఫేస్ టు ఫేస్ తలబడ్డారు. ఇందులో సింధు మూడు మ్యాచుల్లో గెలువగా మారిన్ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ప్రస్తుతం సింధు పదో ర్యాంక్‌లో ఉండగా మారిన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
బ్యాట్మింటన్ ఎరినాలో కరోలినా పేరు మారుమోగుతోంది. లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ అయిన మారిన్ వరుస టైటిల్స్‌తో తనదైన ముద్ర వేస్తోంది. చైనా సవాల్‌ను అధిగమించి మెగా ఈవెంట్‌లో ఫైనల్ చేరింది. స్వర్ణం సాధించి అసలైన ఛాంపియన్‌గా నిలవాలనుకుంటోంది.
ఆత్మవిశ్వాసంతో ఆడాలని సింధు వ్యూహాలు సిద్ధం చేసుకుంది. సెమీస్ ఆటతీరును ఫైనల్స్‌లో రిపీట్ చేయాలనుకుంటోంది. భారత అభిమానులకు గోల్డ్ మెడల్ అందించాలనే పట్టదలతో కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







