ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం :వీకే సింగ్
- August 19, 2016
సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులను కేంద్రమంత్రి వీకే సింగ్ కలిసారు. రాష్ర్టాల వారీగా బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన వేలాది భారతీయ కార్మికులకు సాయం చేయడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ నెల రోజుల్లోనే మరోసారి సౌదీ అరేబియాకు వెళ్లారు. వారికి అక్కడే ప్రత్యామ్నా య ఉపాధిని చూపించడం లేదా వెంటనే భారతకు తీసుకు రావడమనే ద్విముఖ వ్యూహంతో ఆయన సౌదీ విమానం ఎక్కారు. అక్కడి సౌదీ ఓగెర్, సౌదీ బిన్ లాడెన్, సాద్ గ్రూపు కంపెనీల్లో భారతీయ ఉద్యోగులకు తిరిగి స్వ దేశానికి వచ్చేయడం తప్ప మరో మార్గం లేదు.ఈ నేపథ్యంలోనే సమస్యలను పరిష్కరించడానికి వీకే సింగ్ అక్కడికి వెళ్లారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







