ఐటీ రంగంపై ఆటోమేషన్ తీవ్ర ప్రభావం
- August 19, 2016
2021కి దేశంలో ఆటోమేషన్ ప్రభావం అధికం... నైపుణ్యాలు లేకపోతే ఇంటికే
ఐవోటీతో 25వేల కొత్త ఉద్యోగాలుజిన్నోవ్ సంస్థ అధ్యయనంలో వెల్లడిన్యూఢిల్లీ: రోజుకో ఆవిష్కరణతో టెక్నాలజీ రంగం కొత్త రూపు సంతరించుకుంటోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ సాంకేతికను వినియోగించుకుని దూసుకుపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో దీని వినియోగం ఇప్పుడిప్పుడే అధికమవుతోంది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకతో ఎంతోమంది ఐటీ ఉద్యోగులు నిరాశ్రయులయ్యారు. కాగా ఇప్పుడు ఈ ఐటీ రంగంపై ఆటోమేషన్ తీవ్ర ప్రభావం చూపుతోంది.దీని వల్ల దేశంలో 2021 నాటికి సుమారు 70వేల ఉద్యోగులు నిరుద్యోగులుగా మారబోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నైపుణ్యాలు లేని వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అని అని జిన్నోవ్ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం సాధారణ సర్వీసులన్నింటినీ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయడం(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వల్ల మానవ ప్రమేయం తగ్గుతూ వస్తోంది. ఈ ఐవోటీ సాంకేతికత వినియోగం ఐటీ కంపెనీల్లో అధికంగా ఉంది.2021 నాటికి దీని ప్రభావం 1,20.000మందిపై ప్రత్యక్షంగా పడుతుందని, అలాగే 94 వేల ఉద్యోగాలకు కోత పడుతుందని వెల్లడైంది. అడ్మినిసే్ట్రషన, సపోర్ట్ స్టాఫ్, ఇతర ఉద్యోగాలకు ఐవోటీ టెక్నాలజీ ఎసరు పెడుతుందని తేలింది. అయితే ఈ ఐవోటీ వల్ల ఉద్యోగాల్లో కోతేగాక కొత్త ఉద్యోగాలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఐదేళ్లలో 25వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.వాటిలో ప్రొడక్ట్ మేనేజర్లు, రోబో కో-ఆర్డినేటర్లు, ఇండసి్ట్రయల్ ప్రోగామర్లు, నెట్‌వర్క్ ఇంజనీర్లు వంటి వారికి రానున్న కాలంలో భవిష్యత్తు ఉంటుందని తేలింది. ప్రస్తుతం ఐవోటీ సర్వీసెస్ మార్కెట్ 40శాతం ఉందని, కానీ 2021 నాటికి ఇది 44శాతానికి చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2021 నాటికి దేశంలో ఐటీ నైపుణ్యాలు తక్కువగా అవసరమైన ఐటీ ఉద్యోగాల్లో 6.4లక్షల మేర కోత పడనుందని ఇటీవలే హెచఎ్‌ఫఎ్‌స అధ్యయనంలో తేలిన విషయం తెలిసిందే!!
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







