షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!

- September 09, 2026 , by Maagulf
షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!

కువైట్ : షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదాలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు జనరల్ ఫైర్ ఫోర్స్ విస్తృత తనిఖీలను నిర్వహించింది. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో చేపట్టిన ఈ తనిఖీల్లో భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ నిబంధనలు పాటించని భవనాలు, సంస్థలను అధికారులు పరిశీలించారు.ఈ తనిఖీలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ తదితర ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో నిర్వహించాయి.

తనిఖీల్లో నిబంధనలు పాటించని 74 సంస్థలపై పరిపాలనా చర్యలు తీసుకున్నారు. కొన్ని సంస్థలను మూసివేయడంతో పాటు, మరికొన్నింటికి నోటీసులు, హెచ్చరికలు జారీ చేశారు. జనరల్ ఫైర్ ఫోర్స్ నిర్దేశించిన అగ్నిమాపక, భద్రతా నిబంధనలతో పాటు ఇతర సంబంధిత ప్రభుత్వ సంస్థల నిబంధనలను ఉల్లంఘించిన వారిపైనా చర్యలు తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం, అగ్నిప్రమాదాలకు దారితీసే ప్రమాదకర పరిస్థితులను నివారించడం, అన్ని సంస్థలు భద్రతా నిబంధనలు పాటించేలా చూడటంలో భాగంగానే ఈ తనిఖీలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com