సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- September 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజులపాటు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, లోయలు, వరద నీరు చేరే ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద నీటిలో ఈత కొట్టడం లేదా నీటిలోకి వెళ్లడం చేయవద్దని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులకు సంబంధించి అధికారిక మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా వెలువడే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
మక్కా ప్రాంతంలో భారీ వర్షాల అవకాశం
నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) ప్రకారం మక్కా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, వడగళ్ల వానతో పాటు బలమైన గాలులు వీచి దుమ్ము, ఇసుక ఎగిసే అవకాశం ఉందని తెలిపింది. తైఫ్, మైసాన్, అదమ్, అల్-అర్దియాత్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మక్కా, అల్-కమిల్, అల్-జుముమ్, బహ్రా, అల్లైత్, అల్-ఖున్ఫుదా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
జాజాన్, అసీర్, అల్-బాహా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, వరదలు, వడగళ్ల వానతో పాటు దుమ్ము, ఇసుకను ఎగరేసే బలమైన గాలులు వచ్చే అవకాశం ఉందని NCM పేర్కొంది. అదేవిధంగా మదీనా, నజ్రాన్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సివిల్ డిఫెన్స్ సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







