అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- September 09, 2026
అబుదాబి: యూఏఈ, ఇజ్రాయెల్ ప్రభుత్వ అధినేతల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి మీడియా కథనాలపై ఎమిరేట్స్ స్పందించింది. అలాంటి కథనాలపై యూఏఈ ప్రభుత్వం వ్యాఖ్యానించదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 7 తర్వాత యూఏఈ తీసుకున్న చర్యలన్నీ **ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటం, హింసను నివారించడం** లక్ష్యంగానే కొనసాగాయని పేర్కొంది.
అలాగే యూఏఈ, ఇజ్రాయెల్ ప్రభుత్వ సంస్థల మధ్య గత ఐదేళ్లకు పైగా నేరుగా, బహిరంగంగా కమ్యూనికేషన్ మార్గాలు కొనసాగుతున్నాయని తెలిపింది. అవసరమైన సందర్భాల్లో సంబంధిత సంస్థల మధ్య ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం పంచుకున్నామని, ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నామని వెల్లడించింది.
నెతన్యాహుకు యూఏఈ అధ్యక్షుడు హెచ్చరించారా?
ఇజ్రాయెల్ పత్రిక హారెట్జ్ తన కథనంలో, అక్టోబర్ 7, 2023 దాడులకు సుమారు వారంన్నర ముందు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారని పేర్కొంది. గాజాలోని అప్పటి హమాస్ నాయకుడు ఒక ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు హెచ్చరించారని కథనం తెలిపింది. అయితే ఈ ఆరోపణలకు ఎక్కువగా పేరు వెల్లడించని వర్గాలను ఆధారంగా చేసుకున్నట్లు పేర్కొంది. నెతన్యాహు ఆ హెచ్చరికకు లైట్ తీసుకున్నట్లు కథనం పేర్కొంది. అయితే నెతన్యాహు కార్యాలయం ఈ వార్తను ఖండించింది. అక్టోబర్ 7కు ముందు యూఏఈ నుంచి ప్రధానికి ఎలాంటి హెచ్చరిక అందలేదని స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్‌లో రాజకీయ దుమారం
ఈ కథనం వెలువడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతలు నెతన్యాహు ప్రధానిగా కొనసాగేందుకు అనర్హుడని విమర్శించారు. మాజీ సైనిక కమాండర్, నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతున్న గాది ఐసెన్కాట్, అక్టోబర్ 7కు ముందు అనేక హెచ్చరికలు వచ్చినప్పటికీ వాటిని నెతన్యాహు పట్టించుకోలేదని ఆరోపించారు.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో సుమారు 1,200 మంది మరణించగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అనంతరం ఇజ్రాయెల్ చేపట్టిన భారీ సైనిక దాడుల్లో గాజా పూర్తి ధ్వంసమైంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మరణించిన వారి సంఖ్య 73,658కు చేరింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







