'రామసక్కనోడు' చిత్రం షూటింగ్ ప్రారంభమO...
- August 20, 2016
రాహుల్ రవీంద్రన్, నిత్యాశెట్టి, తరుణిక హీరోహీరోయిన్లుగా రాథోడ్ ఎం. దర్శకత్వంలో అమ్మనాన్న ఫిలింస్ పతాకంపై మణీంద్రన్ ఎం. నిర్మిస్తున్న 'రామసక్కనోడు' చిత్రం ఇటీవల రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత మణీంద్రన్ మాట్లాడుతూ, 'కథ నచ్చి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. గురువారం నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షూటింగ్‌ని 15రోజుల పాటు జరుపనున్నాం' అని అన్నారు. 'ఆద్యంతం వినోదాత్మకంగా సినిమా సాగు తుంది. కథకు తగ్గట్టుగా మంచి ఆర్టిస్టులు దొరికారు.నిర్మాతలు క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు' అని దర్శకుడు రాథోడ్ ఎం. తెలిపారు. హీరో రాహుల్ రవీంద్రన్ చెబుతూ, 'మంచి వినోదమున్న కథ ఇది. నా పాత్ర భిన్నంగా ఉంటుంది' అని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







