36 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఇరాక్ లో ఉరితీత...
- August 21, 2016
36 మంది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను ఇరాక్ ఆదివారం ఉరితీసింది. 2014లో సున్నీ జిహాదీలు, సంకీర్ణ తీవ్రవాదులు కలిసి టిక్రిట్ నగరంలోని ఆర్మీ స్థావరంపై దాడిచేసి వందలాదిమందిని ఊచకోత కోశారు. 17 వందల మంది ఆర్మీ రిక్రూటర్లను అపహరించిన ఉగ్రవాదులు వారిలో 300 మందిని అతి దారుణంగా చంపేశారు. స్పీచర్ నరమేధంగా పిలిచే కేసులో 36 మందిని దోషులుగా తేల్చిన కోర్టు గతేడాది మరణశిక్ష విధించింది. నసిరియా కారాగారంలో ఆదివారం వీరికి మరణశిక్ష అమలు చేసినట్టు ధిఖార్లోని గవర్నర్ కార్యాలయం తెలిపింది. మరణిశిక్షను తిలకించేందుకు బాధిత బంధువులు చాలామంది జైలుకు చేరుకున్నారు. ఉగ్రవాదులను ఉరితీస్తున్నప్పుడు సంతోషంతో 'అల్లాహు అక్బర్' అని పెద్ద ఎత్తున నినదించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







