టెంట్స్‌ తగలబెట్టిన కేసులో బహ్రెయినీకి జైలు

- August 21, 2016 , by Maagulf
టెంట్స్‌ తగలబెట్టిన కేసులో బహ్రెయినీకి జైలు

గత పార్లమెంటరీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి చెందిన రెండు టెంట్లను తగలబెట్టిన కేసులో బహ్రెయిన్‌కి చెందిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఈ కేసులో మరో వ్యక్తికి కూడా జైలు శిక్ష విధించింది హై క్రిమినల్‌ అపీల్స్‌ కోర్ట్‌. ఇద్దరికీ చెరో ఐదేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. టెంట్లపై పెట్రోల్‌ని పోసి, ఫైర్‌బంబ్స్‌ని విసిరి తగలబెట్టారు నిందితులు. 2014, అక్టోబర్‌ 25న జరిగింది ఈ ఘటన. ఎన్నికల పోటీ నుంచి సదరు అభ్యర్థి తప్పుకునేలా చేయడానికే ఈ దారుణానికి ఒడిగట్టారు నిందితులు. అయితే ఆ అభ్యర్థి అబ్దుల్లా తాహిర్‌ ఎన్నికల్లో పోటీ చేశారు, అయితే ఓడిపోయారు. అగ్ని ప్రమాదం కారణంగా జరిగిన నష్టాన్ని 4,500 బహ్రెయినీ దినార్లుగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో పవర్‌ జనరేటర్‌, పెద్ద రగ్గు వంటివి దహనమయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com