అల్ అహ్సాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సహా 9 మంది మృతి..!!
- September 21, 2026
అల్ అహ్సా: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్ ఉకైర్–అల్ ఉయూన్ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో పాటు మొత్తం 9 మంది మృతి చెందారు. మొదటి వాహనంలో ప్రయాణిస్తున్న ఒక కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. మరో వాహనంలో ఉన్న ఇద్దరు యువకులు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
కాగా, ప్రమాదానికి వాహనం అకస్మాత్తుగా పక్కకు మళ్లడమే కారణమని తూర్పు ప్రావిన్స్ ట్రాఫిక్ విభాగం ప్రాథమికంగా తెలిపింది. ఘటనపై అవసరమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందిన వెంటనే సివిల్ డిఫెన్స్, రెడ్ క్రెసెంట్‌కు చెందిన ప్రత్యేక రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ధ్వంసమైన వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అల్ ఉకైర్–అల్ ఉయూన్ రహదారి తూర్పు ప్రావిన్స్‌లోని కీలక మార్గాల్లో ఒకటి. ఇది అల్ అహ్సా గవర్నరేట్‌లోని పలు ప్రాంతాలను తీర ప్రాంతాలతో కలుపుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







