పేదరికం పై భారత్ విజయం: ప్రధాని మోదీ

- November 19, 2026 , by Maagulf
పేదరికం పై భారత్ విజయం: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. అంతే వేగంతో పేదరికాన్ని కూడా జయించిందని చెప్పారు. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశం మరింత అభివృద్ధి చెంద‌డానికి అవసరమైన సంస్కరణలను నిస్సందేహంగా తెలియ‌జెప్పాల‌ని కార్పొరేట్‌ సంస్థలను కోరారు. గత ప్రభుత్వం పేదరిక నిర్మూలన లో విఫలమైందని ఆయ‌న విమ‌ర్శించారు. భారత‌దేశం ఒకప్పుడు బలహీనమైన ఐదు దేశాల సరసన ఉండేదని ప్ర‌ధాని మోదీ అన్నారు. గ‌త ప‌న్నెండేళ్లుగా దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. భారతదేశ‌ పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తున్న‌ద‌ని అన్నారు. పాత ప్ర‌భుత్వాల‌ విధానాలు భారతదేశ‌ వృద్ధిని అణచివేశాయని ప్ర‌ధాని ఆరోపించారు. కాలం చెల్లిన విధానాలు దేశాభివృద్ధిని కుంటుపరిచాయని అన్నారు. గత విధానపరమైన వైఫల్యాలు దేశం వృద్ధిని నిరోధించాయ‌ని చెప్పారు.

50 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారు

కార్పొరేట్‌ సంస్థలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. గడిచిన‌ 13 ఏళ్లలో భారత్‌లో 50 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని చెప్పారు. ఈ విష‌యం తాను చెబుతున్న‌ది కాద‌ని, ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొన‌ద‌ని ఆయ‌న తెలిపారు. వ్యాపారులను ప్రోత్సాహించేందుకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామ‌న్నారు. అదేవిధంగా వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించామ‌ని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com