హీరో రానా వ్యాపార రంగం మీద దృష్టి..
- August 23, 2016
నటుడిగా సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా, ఇప్పుడు వ్యాపార రంగం మీద దృష్టిపెట్టాడు. గతంలో ఓ యానిమేషన్ కంపెనీ నడిపిన అనుభవం ఉన్న ఈ మ్యాన్లీ హంక్, ఇప్పుడు టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ చేస్తున్నాడట. అయితే కొత్తగా కంపెనీని ఏర్పాటు చేసే కన్నా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అయితే బెటర్ అని భావించి, ముంబైలో నడుస్తున్న కంపెనీని టేకోవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా పూరి కనెక్ట్స్ పేరుతో ఇదే తరహా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ కంపెనీ ద్వారా సెలెక్ట్ అయిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం నుంచి పది శాతం వరకు కంపెనీకి వచ్చేలా ఒప్పందాలు చేసుకుంటారు.వ్యాపార పరంగానే కాకుండా కొత్త వారికి అవకాశాలు కూడా కల్పిస్తుండటంతో ఈ తరహా వ్యాపారాల మీద సినీ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







