మజ్ను ఆడియో రిలీజ్ డేట్ ను కన్ఫామ్..
- August 23, 2016
వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నాని, హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మజ్ను. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశాడు హీరో నాని.మంగళవారం ఉదయం సినిమాలోని కళ్లు మూసి తెరిచే లోపే పాటను రిలీజ్ చేసిన నాని, ఆగస్టు 26న ఆడియో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..







