సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!

- November 18, 2026 , by Maagulf
సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఇంజినీరింగ్ వృత్తి ప్రమాణాలను కాపాడేందుకు చేపట్టిన తనిఖీల్లో మొత్తం 1,593 చెల్లని, గుర్తింపు లేని సర్టిఫికెట్లను గుర్తించినట్లు సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజినీర్స్ వెల్లడించింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు 'మొసాదఖా' (Mosadaqa) ప్లాట్‌ఫామ్ సహకారంతో నిర్వహించిన పరిశీలనల్లో 603 చెల్లని సర్టిఫికెట్లు, 990 గుర్తింపు లేని సర్టిఫికెట్లు బయటపడినట్లు తెలిపింది. 

ఇంజినీరింగ్ అర్హతలను ధ్రువీకరించడం, వృత్తిపరమైన ప్రమాణాలను కాపాడటం, ప్రొఫెషనల్ అక్రిడిటేషన్‌పై విశ్వసనీయతను పెంచడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు కౌన్సిల్ పేర్కొంది. ఇక విభాగాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 174 చెల్లని సర్టిఫికెట్లు గుర్తించారు. సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, కన్‌స్ట్రక్షన్ విభాగాల్లో 83, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 79 సర్టిఫికెట్లు బయటపడ్డాయి. మిగిలినవి ఇతర ఇంజినీరింగ్, సాంకేతిక విభాగాలకు చెందినవిగా వెల్లడించింది. చెల్లని సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులను తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజినీర్స్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com