ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!

- November 18, 2026 , by Maagulf
ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!

మస్కట్: ఒమన్‌లో 2001 నుంచి 2025 వరకు చేపట్టిన ఉల్కల పరిశోధన వివరాలను పొందుపరుస్తూ హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేసింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను ఈ పుస్తకంలో వివరించారు. ఇంధన, ఖనిజాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇంజినీర్ మొహ్సిన్ హమద్ అల్ హద్రామి ముఖ్య అతిథిగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఒమానీ-స్విస్ ఉల్కల పరిశోధన బృందం సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉల్కల పరిశోధన రంగంలో ప్రముఖ శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ బేడా హాఫ్‌మన్, ప్రొఫెసర్ ఎడ్విన్ గ్నోస్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. 2001 నుంచి 2025 వరకు ఒమన్ భూభాగంలో గుర్తించిన ఉల్కల నమూనాలను సేకరించడం, వాటిని నమోదు చేయడం, శాస్త్రీయంగా అధ్యయనం చేయడంపై ఈ పరిశోధనల్లో ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఒమన్‌లో లభించిన ఉల్కలపై శాస్త్రీయ అవగాహన మరింత పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశానికి చెందిన భౌగోళిక, ఉల్కల వారసత్వ సంపదను గుర్తించి, భద్రపరిచే ప్రయత్నాలకు కూడా ఈ పరిశోధనలు దోహదపడ్డాయని పేర్కొంది. విస్తారమైన ఎడారి ప్రాంతాలు, ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా ఉల్కల అన్వేషణ, సేకరణ, పరిరక్షణ, పరిశోధనలకు ఒమన్ కీలక ప్రాంతంగా నిలుస్తోందని పుస్తకంలో వివరించారు. ఈ ప్రచురణతో ఒమన్‌లోని పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సహకారం పెరుగుతుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com