భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు

- October 05, 2026 , by Maagulf
భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు

దుబాయ్: భారత్–యూఏఈ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరిగాయి. దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఈ. విష్ణువర్ధన్ రెడ్డి, యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మారీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా భారత్–యూఏఈ మధ్య కొనసాగుతున్న బలమైన ఆర్థిక భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరువురు చర్చించారు.

రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడం, ఇరు దేశాల వ్యాపార వర్గాల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం వంటి అంశాలపై సమావేశంలో దృష్టి సారించారు.

భారత్–యూఏఈ మధ్య ఆర్థిక సహకారం మరింత విస్తరించేందుకు ఇలాంటి ఉన్నతస్థాయి చర్చలు కీలకంగా మారనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com