మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- October 05, 2026
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "మహాలక్ష్మి" ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు బాటలు వేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ పథకానికి రోజురోజుకూ ప్రయాణికుల నుండి ఆదరణ పెరుగుతుండటంతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రవాణా సదుపాయాలను నిరంతరం విస్తరిస్తోంది.
గత సంవత్సరం (2025)తో పోలిస్తే ఈ సంవత్సరం (2026) జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2025 త్రైమాసికంలో 3,467.91 లక్షల (34.67 కోట్లు) మంది ప్రయాణించగా, 2026 నాటికి అది ఏకంగా 3,565.11 లక్షలకు (35.65 కోట్లు) చేరింది. కేవలం ఈ మూడు నెలల కాలంలోనే గత ఏడాదితో పోలిస్తే అదనంగా 97.20 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.
ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా చర్యలు – ప్రధాన రూట్లలో ట్రిప్పుల పెంపు:
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను నిరంతరం పరిశీలిస్తూ, బస్సుల సంఖ్యను మరియు ట్రిప్పులను పెంచడం ద్వారా మహిళలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని టీజీఎస్ ఆర్టీసీ అందిస్తోంది.
ముఖ్యంగా అంతర్ జిల్లా మరియు ప్రధాన మార్గాల్లో ట్రిప్పులను అదనంగా పెంచడం జరిగింది:
ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాలు: ఖమ్మం ↔ ఇల్లందు, ఇల్లందు ↔ కొత్తగూడెం, ఖమ్మం ↔ మధిర, సూర్యాపేట ↔ ఖమ్మం
ఉత్తర తెలంగాణ & కరీంనగర్ రీజియన్: హుస్నాబాద్ ↔ కరీంనగర్, కరీంనగర్ ↔ గోదావరిఖని / మందమర్రి, హన్మకొండ ↔ కరీంనగర్
వరంగల్ & ఉమ్మడి నల్గొండ రీజియన్: సంగారెడ్డి ↔ హన్మకొండ, హన్మకొండ ↔ తొర్రూరు, నల్గొండ ↔ దేవరకొండ, నల్గొండ ↔ సూర్యాపేట, దేవరకొండ ↔ మిర్యాలగూడ, అచ్చంపేట ↔ దేవరకొండ
హైదరాబాద్ & రాజధాని కనెక్టివిటీ: సిద్దిపేట ↔ JBS, నాగర్‌కర్నూలు ↔ హైదరాబాద్, కోస్గి ↔ హైదరాబాద్
నిజామాబాద్ & ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్: బాన్సువాడ ↔ నిజామాబాద్, బోధన్ ↔ నిజామాబాద్, కామారెడ్డి ↔ రామాయంపేట
దక్షిణ తెలంగాణ రీజియన్: కల్వకుర్తి ↔ మహబూబ్‌నగర్
"మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి మహిళా ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది... ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో డిపో మేనేజర్లు, అధికారులు సమీక్షిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులను, బస్సులను సమకూరుస్తున్నాం. రాబోయే పండుగల సీజన్లలో కూడా మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని ప్రత్యేక సర్వీసులు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం".
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







