సెప్టెంబర్ 1 నుంచి కొత్త కరెన్సీ నోట్లు
- August 24, 2016
కొత్త కరెన్సీ నోట్లు సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. 10, 20 బహ్రెయినీ దినార్స్ 'నోటు' రూపంలో అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త నోట్లను డూప్లికేట్ చేయడం దాదాపు అసాధ్యమని అధికారిక వర్గాలు అంటున్నాయి. మరింత భద్రత కలిగిన ఫీచర్లతో వీటిని రూపొందించారు. కొత్త నోట్లపై బ్యాంకులకు ఇప్పటికే సమాచారం అందించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల చెలామణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సిబిబి స్పష్టం చేసింది. బహ్రెయినీ కరెన్సీ నోట్లలో మార్పు చివరిసారిగా 2008లో జరిగింది. 2008 మార్చ్ 17న కొత్త డిజైన్లు, సెక్యూరిటీ ఫీచర్లతో అన్ని డినామినేషన్లకు సంబంధించిన కొత్త నోట్లను విడుదల చేశారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







