రష్‌ అవర్‌లో ట్రక్కులపై నిషేధం

- August 25, 2016 , by Maagulf
రష్‌ అవర్‌లో ట్రక్కులపై నిషేధం

ట్రక్కులు మరియు కార్మికుల్ని తరలించడానికి ఉపయోగించే 50 సీట్లు కలిగిన ప్యాసింజర్‌ బస్సులు అబుదాబీ ఐలాండ్‌ ఇంటర్నల్‌ రోడ్స్‌లోకి ఇకపై రష్‌ అవర్‌లో అనుమతించబడవు. ఉదయం 6.30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని అబుదాబీ పోలీస్‌ - ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టరేట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. రహదారులపై మరింత భద్రత కోసం ఈ చర్య తీసుకున్నట్లు అబుదాబీ పోలీస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఆపరేషన్స్‌ బ్రిగేడియర్‌ అలి ఖల్ఫాన్‌ అల్‌ దహెరి చెప్పారు. ఈ నిషేధంతో స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఎలాంటి సమస్యలూ లేకుండా స్కూల్స్‌కి చేరుకోవచ్చని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com