వినోద్ హత్య కేసులో అక్షయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు
- August 25, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని వినోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అక్షయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక లోని బళ్ళారి జిల్లా సండూర్ తాలూకా నర్సాపూర్ గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హత్యకు గురైన వినోద్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ తిరుపతిలో గురువారం స్వయంగా పరామర్శించిన సంగతి తెలిసిందే.అక్షయ్ తో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు నర్సాపురం లోని నందిని ధాబా వద్ద అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు.అటు-మరో ఏడుగురి ప్రమేయం సైతం ఈ కేసులో ఉన్నట్టు తెలిసింది. వారికోసం ఖాకీలు గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనలో హీరో తారక్ ఎలాంటి కామెంట్ చేయకపోవడం చర్చనీయాంశ మైంది. తమ అభిమానులు హింసకు పాల్పడరాదని, అభిమానం దురభిమానంగా మారరాదని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







