కాఠ్మాండూ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం
- August 25, 2016
నేపాల్‌లోని కాఠ్మాండూ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కాఠ్మాండూకు 120 కిలోమీటర్ల దూరంలోని చందిభంజ్యాంగ్ ప్రాంతంలో అదుపుతప్పి త్రిశోలి నదిలో పడిపోయింది. బస్సు దాదాపు నీటిలో మునిగిపోవడంతో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 17 మంది గాయాలతో బయటపడ్డారు. పోలీసులు సహా గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
మృత దేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







