బ్యాడ్ న్యూస్ : బార్‌లో మందు తాగే వారికి...

- August 26, 2016 , by Maagulf
బ్యాడ్ న్యూస్ : బార్‌లో మందు తాగే వారికి...

బార్ షాపుల్లో మద్యం తాగే వారికి ఓ బ్యాడ్ న్యూస్. తాగిన మత్తులో స్టఫ్ ఆర్డర్ ఇస్తే... ఇక అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. కుళ్లిపోయిన చికెన్‌ను ఫ్రై చేసి అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయం శుక్రవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ పరిధిలోగల బార్ అండ్ రెస్టారెంట్లలో ఆర్మీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా అనుమతి లేకుండా నడుపుతున్న బార్లను గుర్తించడమేగాక కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హిట్ బార్‌ను సీజ్ చేశారు. నగరంలోని కొన్ని రెస్టారెంట్లు, బార్లలో కుళ్లిపోయిన మాంసం, నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారనే వార్తలు ప్రస్తుతం వెలుగుచూసిన సంఘటనతో బహిర్గతమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com