బహ్రెయిన్ తీవ్రవాద దాడిని ఖండించిన ముస్లిం వల్డ్ లీగ్
- July 30, 2015
బహ్రెయిన్ దేశం, సిట్రాలో ఇద్దరు పోలీసులను పొట్టనపెట్టుకుని, అనేకమందిని గాయాలపాలు చేసిన తీవ్రవాద దాడిని, మక్కాలోని ద ముస్లిం వల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ డా. అబ్దుల్లా బిన్ అబ్దుల్ మొహ్సిన్ అల్-తుర్కీ తీవ్రంగా ఖండించారు. ఆయన వెలువరించిన ఒక ప్రకటనలో, ప్రాంతీయ భద్రతను అల్లకల్లోలం చేసే లక్ష్యంతో సాగిన ఈ దాడిని ఖండిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులు ఇస్లాం కు మాత్రమేకాక మానవత్వానికి, అంతర్జాతీయ విలువలకు కూడా విఘాతమని చెబుతూ, దీనిని ఖండిచిన దేశాలు, అంతర్జాతీయ సంస్థలను ప్రశంసించారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







