వాట్సాప్‌ గ్లోబల్‌ ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌

- August 27, 2016 , by Maagulf
వాట్సాప్‌ గ్లోబల్‌ ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌

ప్రముఖ మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సాప్‌ గ్లోబల్‌ ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌ చేసింది. ఈ అప్‌డేషన్‌తో వాట్సాప్‌ ఇక మీదట వినియోగదారుల ఫోన్‌ నెంబర్లు ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. ఈ మార్పు ఫేస్‌బుక్‌కు ప్రకటనల విషయంలో సహాయపడుతుంది. మరింతగా వినియోగదారులు లక్ష్యంగా ప్రకటనలు ఇచ్చే వీలుంటుంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన తర్వాత మొదటిసారి ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌ చేసింది. అయితే వాట్సాప్‌ మాత్రం ప్రకటనల రహితం(యాడ్‌-ఫ్రీ)గానే ఉంటుందని వాట్సాప్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఆపరేషన్స్‌ వేర్వేరుగా ఉంటాయని వినియోగదారుల డేటాను వారి సమ్మతి లేకుండా వినియోగించుకోమని స్పష్టంచేశారు.వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌కు పైగా యూజర్లు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com