చైనా హువాయ్‌ భారత్‌లో పెద్దది..

- August 27, 2016 , by Maagulf
చైనా  హువాయ్‌ భారత్‌లో పెద్దది..

 చైనా సంస్థ హువాయ్‌ ప్రపంచంలో అతిపెద్ద గ్లోబల్‌ సర్వీస్‌ సెంటర్‌(జీఎస్‌సీ)ను బెంగళూరులో ప్రారంభించింది. 30కుపైగా దేశాల్లోని 350 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు సంస్థ ఇండియా సీఈవో జే చెన్‌ తెలిపారు. ఇందు కోసం 1000 మంది ఇంజినీర్లు, నెట్‌వర్క్‌ ఆపరేటర్లను, సిబ్బందిని తీసుకున్నట్లు చెప్పారు. భారత్‌లో ఏర్పాటు చేసిన జీఎస్‌సీలో పరిశోధన, అభివృద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనా, రొమేనియా, మెక్సికోలో ఉన్న జీఎస్‌సీల కంటే భారత్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం పెద్దదని చెన్‌ వివరించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com