IIFA అవార్డ్స్‌లో ‘ధురంధర్’ హవా
- October 31, 2026
భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) 26వ అవార్డుల వేడుక అక్టోబర్ 30న వైభవంగా జరిగింది. వివిధ విభాగాలు, నటీనటులు ,సాంకేతిక నిపుణుల సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులను ప్రకటించారు.
12 అవార్డులతో ‘ధురంధర్’ సంచలనం
ఈ ఏడాది ఐఫా అవార్డుల్లో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ‘ధురంధర్’ చిత్రం ఏకంగా 12 పురస్కారాలను గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. నటన, దర్శకత్వం, రచనతో పాటు పలు కీలక విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను కైవసం చేసుకుంది. రణ్‌వీర్ సింగ్ తన నటనకు గానూ ఉత్తమ నటుడి పురస్కారాన్ని దక్కించుకున్నారు.
ముఖ్యమైన పురస్కారాలు సాధించిన చిత్రాలు, నటీనటులు
‘సయా రా’ (Saiyaara) చిత్రంలో ప్రతిభావంతమైన నటనకు గానూ అనిత్ పడ్డా (Aneet Padda) ఉత్తమ నటి అవార్డును అందుకని నిలిచారు. ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ (Jolly LLB 3) చిత్రంలో అద్భుత నటనకు గానూ హుమా ఖురేషీకి సహాయ నటి పురస్కారం దక్కింది. ‘ఛావా’ (Chhaava) చిత్రం పలు సాంకేతిక విభాగాల్లో అవార్డులు సాధించి సత్తా చాటింది.
డిజిటల్ అవార్డులలోనూ సందడి
డిజిటల్ (ఓటీటీ) కేటగిరీలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు పురస్కారాలు గెలుచుకున్నాయి. డిజిటల్ ఫిల్మ్ కేటగిరీలో ‘బారాముల్లా’ (Baramulla), ‘స్టోలన్’ (Stolen) చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఆర్యన్ ఖాన్ భాగస్వామ్యమైన ‘ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Bads of Bollywood), ‘పాతాళ్ లోక్ 2’ (Paatal Lok 2) డిజిటల్ సిరీస్ విభాగంలో ప్రముఖ పురస్కారాలను సాధించాయి.
మెరిసిన వ్యాఖ్యాతలు
ఈ గ్రాండ్ అవార్డుల వేడుకను ప్రధాన విభాగంలో కరణ్ జోహార్, వరుణ్ ధావన్, మనీష్ పాల్, అనన్య పాండే కలసి ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఇక డిజిటల్ అవార్డుల ప్రధానోత్సవానికి పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆకట్టుకున్నారు.
అవార్డుల జాబితా ఇదే
- ఉత్తమ చిత్రం: ధురంధర్
- ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అవతార్: ఫైర్ అండ్ యాష్
- ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్)
- ఉత్తమ నటుడు: రణ్‌వీర్ సింగ్ (ధురంధర్)
- ఉత్తమ నటి: అనీత్ పడ్డా (సైయారా)
- ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ దత్ (ధురంధర్)
- ఉత్తమ సహాయ నటి: హ్యూమా ఖురేషీ (జాలీ ఎల్‌ఎల్‌బీ 3)
- ఉత్తమ విలన్: అక్షయ్ ఖన్నా (ధురంధర్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: శాశ్వత్ సచ్‌దేవ్ (ధురంధర్)
- ఉత్తమ ఒరిజినల్ కథ: ఆదిత్య ధర్ (ధురంధర్)
- ఉత్తమ గీత రచయిత: ఇర్షాద్ కామిల్ (సైయారా)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: ఫహీమ్ అబ్దుల్లా (సైయారా)
- ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (సైయారా)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: వికాస్ నౌలఖా (ధురంధర్)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆదిత్య ధర్ (ధురంధర్)
- ఉత్తమ డైలాగ్స్: ఆదిత్య ధర్ (ధురంధర్)
- ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పనికర్ (ధురంధర్)
- ఉత్తమ సౌండ్ డిజైన్: బిశ్వదీప్ ఛటర్జీ (ధురంధర్)
- ఉత్తమ సౌండ్ మిక్సింగ్: అలోక్ డే (ఛావా)
- ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఏఆర్ రెహమాన్ (ఛావా)
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అసెంబ్లేజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రీడిఫైన్ (ఛావా)
- ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడు: అహాన్ పాండే (సైయారా)
తాజా వార్తలు
- వైఎస్సార్సీపీ గల్ఫ్ కమిటీ నియామకం..షేక్ అబ్దుల్లాకు సలహాదారు బాధ్యతలు
- సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: కేంద్ర మంత్రి జైశంకర్
- IIFA అవార్డ్స్‌లో ‘ధురంధర్’ హవా
- యూఏఈకి వెళ్లే భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..!!
- హార్ముజ్ లో గాయపడిన భారతీయుడు మస్కట్‌కు తరలింపు..!!
- కెన్యాకు ప్రయాణంపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులపై కొత్త నిబంధనలు?
- ఖతార్ రియల్ ఎస్టేట్‌లో మారుతున్న ఇన్వెస్టర్ల ధోరణి..!!
- గడువు తేదీల్లో అక్రమ మార్పులు.. 27 మంది అరెస్ట్..!!







