కువైట్‌లో 20 శాతం తగ్గిన కోర్టు కేసులు..!!
- November 02, 2026
కువైట్ సిటీ: కువైట్‌లో కోర్టుల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2026 మొదటి 9 నెలల్లో 2024లో ఇదే కాలంతో పోలిస్తే కేసుల సంఖ్య 20 శాతం తగ్గినట్లు న్యాయశాఖ మంత్రి కౌన్సిలర్ నాసర్ అల్-సుమైత్ వెల్లడించారు. 2024 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశంలోని అన్ని కోర్టుల్లో సుమారు 835,000 కేసులు ఉండగా, 2026లో ఇదే కాలానికి ఆ సంఖ్య 665,000కు తగ్గింది. అంటే దాదాపు 170,000 కేసులు తగ్గినట్లు తెలిపారు.
కోర్ట్ ఆఫ్ కాసేషన్లో కేసులు 39 శాతం తగ్గాయి. 2024లో సుమారు 16,000 కేసులు ఉండగా, 2026లో వాటి సంఖ్య 10,000కు పడిపోయింది. చిన్నపాటి నేరాలకు సంబంధించిన అప్పీల్ కేసులు కూడా 41 శాతం తగ్గాయి. 5,700 నుంచి 3,300కు చేరుకున్నాయి. అన్ని కోర్టుల్లో క్రిమినల్ కేసులు 21 శాతం తగ్గాయి. 2024లో సుమారు 5,66,000 కేసులు ఉండగా, 2026లో 449,000కు తగ్గాయి. అదేవిధంగా చెల్లింపులకు సంబంధించిన పేమెంట్ ఆర్డర్లు సుమారు 67,000 నుంచి 27,000కు పడిపోయాయి. వీటిలో దాదాపు 60 శాతం తగ్గుదల నమోదైంది.
దేశంలో న్యాయ వ్యవస్థను ఆధునీకరించేందుకు జాతీయ ప్రణాళికలో భాగంగా తీసుకొచ్చిన చట్టాలు ఈ మార్పులకు దోహదపడ్డాయని మంత్రి వివరించారు. అప్పుల్లో ఉన్నవారికి సహాయం అందించేందుకు చేపట్టిన 'అల్-ఘరిమీన్' (Al-Gharimeen) ప్రచార కార్యక్రమం తుది ఫలితాలను ప్రకటించేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ గణాంకాలను వెల్లడించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో దీపావళి సందడి..!
- డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- ఎల్ఎన్జీ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- దుబాయ్ పర్యాటకులకు గుడ్‌న్యూస్..!!
- బహ్రెయిన్‌లో PACT ఆధ్వర్యంలో సందడిగా దాండియా నైట్..!!
- కువైట్‌లో 20 శాతం తగ్గిన కోర్టు కేసులు..!!
- దుబాయ్‌లో 10 నెలల్లో 48,950 మందికి జరిమానాలు..!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు..!!
- కువైట్‌లో కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న సంస్థపై దాడి..!!
- ఒమన్‌లో జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష..!!







