సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!

- November 02, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో, బ్రాంకో రాప్టర్ వాహనాల యజమానులకు కీలక హెచ్చరిక జారీ అయింది. ఇంజిన్ భాగంలోని విద్యుత్ వైర్లలో లోపం కారణంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో మొత్తం 3,680 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021 నుంచి 2026 మోడల్ సంవత్సరాలకు చెందిన ఫోర్డ్ బ్రాంకో, బ్రాంకో రాప్టర్ వాహనాలకు ఈ రీకాల్ వర్తిస్తుంది.

మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో ఉండే చిన్న విద్యుత్ వైర్లకు రక్షణగా ఏర్పాటు చేసిన కవరింగ్‌లో లోపం గుర్తించారు. దీంతో వైర్లు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఫలితంగా వాహనంలో మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో పాటు ప్రయాణికులకు గాయాలు లేదా ప్రమాదాలు సంభవించే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు.

వాహన యజమానులు ఏం చేయాలి?

రీకాల్ పరిధిలో తమ వాహనం ఉందో లేదో తెలుసుకోవడానికి యజమానులు వాహన గుర్తింపు సంఖ్య (VIN) ద్వారా అధికారిక వెబ్‌సైట్ [Recalls.sa] లో తనిఖీ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. లోపం ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత డీలర్లను సంప్రదించి ఉచితంగా మరమ్మతులు చేయించుకోవాలని కోరింది.

మరిన్ని వివరాలకు అల్ జజీరా వెహికల్స్ ఏజెన్సీస్: 8007492222,  మహమ్మద్ యూసుఫ్ నాగీ కంపెనీ: 8001240218 సంప్రదించాలని సూచించారు. వాహనాల్లో తలెత్తే విద్యుత్ లోపాల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ రీకాల్ చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com