ఇద్దరు నైజిరీయన్ల అరెస్ట్
- August 27, 2016
ఖతార్ ఎయిర్వేస్లో ఉద్యోగం వచ్చిందని చెప్పి మోసం చేసిన ఇద్దరు నైజిరీయన్లను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నిందితులు మిచెల్ జేమ్స్ (30), ఉమేదీ వాలంటైన్(32) నుంచి 52 సిమ్‌కార్డులు, మూడు ల్యాప్ ట్యాప్‌లు, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు డాటా కార్డులను స్వాధీనం చేసుకున్నారు. జనవరిలో శంషాబాద్‌కు చెందిన యువతి ఈ-మె యిల్‌కు నిందితులు సందేశం పంపారు. ఖతార్ ఎయిర్ వేస్ కంపెనీలో అసిస్టెంట్ మెనేజర్‌గా ఉద్యోగం వచ్చిందని, సాలరీ 7900 యూకే ఫౌండ్లు అని అందులో పేర్కొన్నారు.
సందేశం వచ్చిన కొద్దిసేపటికే ఒక నెంబర్ నుంచి బాధితురాలికి వారు ఫోన్ చేశారు. నీకు ఉద్యోగం వచ్చింది. కానీ, వీసా, ఇతర చార్జీల కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని నమ్మిచారు. దీంతో బాధితురాలు వారు చెప్పిన మాటలు విని పలు దఫాలుగా మొత్తం రూ.2.25 లక్షలను నిందితులు చెప్పిన ఖాతాలలో జమ చేసింది.
డబ్బు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో.. మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఆగస్టు 8న ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీలో కేంద్రంగా.. నిరుద్యోగులను మోసం చేస్తున్న మిచెల్జేమ్స్, ఉమేది వాలంటైన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
నిందితులు నేరం అంగీకరించడంతో.. టాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి రిమాండ్‌కు తరలించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







