15 మంది పౌరులు మృతి
- August 27, 2016
సిరియాలోని తూర్పు అలెప్పోలోని మాడీ నగరం వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈ దాడులలో 15 మంది పౌరులు మృతి చెందారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ మానిటర్ తెలిపింది. బాబ్ అల్ నేరబ్ జిల్లాలో గురువారం జరిగిన బాంబు దాడులలో 11 మంది పిల్లలతోపాటు 15 మంది మరణించారు. వారికి నివాళులర్పిస్తున్న ప్రజలకు సమీపంలో ప్రభుత్వ విమానం బ్యారెల్ బాంబును విసిరింది. గాయపడ్డ వారికి సహాయం చేయడానికి అక్కడ జనం గుమిగూడారు. క్షతగాత్రుల కోసం ఆంబులెన్స్‌లు వచ్చిన తర్వాత మరో బాంబు విసరడంతో మరింత మంది మృతి చెందారని ఆ సంస్థ తెలిపింది.2012 నుంచి అలెప్పో నగరం రెండుగా విడిపోయింది. తూర్పు అలెప్పో ప్రాంతాన్ని తిరుగుబాటుదారులు ఆక్రమించుకోగా, పశ్చిమ అలెప్పో ప్రాంతం ప్రభుత్వం అధీనంలో ఉంది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







