డెన్మార్క్ రాజధాని కొపెన్‌హేగెన్ నగరంలో మహిళల మసీదు ప్రారంభం..
- August 28, 2016
డెన్మార్క్ రాజధాని కొపెన్‌హేగెన్ నగరంలో ముస్లిం మహిళలు ప్రార్థన (నమాజ్) నిర్వహించుకునేందు కోసం ఓ మసీదును నిర్మించుకున్నారు. కాగా, ఆ మసీదులో అజా ( నమాజుకు రమ్మని పిలుపునివ్వడం )తో పాటు ఖుద్బా ( ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఇచ్చే ప్రసంగం ) ఇచ్చే మౌజన్, ఇమామ్‌లు కూడా మహిళలు కావడం విశేషం. శుక్రవారం ఇమామ్ షెరీన్ ఖాన్కన్ అజా ఇచ్చి మసీదును ప్రారంభిం చారు. అనంతరం సహచర ఇమామ్ సాలిహా మారీ ఫెత్తేV్‌ా ప్రసంగించారు. 'ఆధునిక ప్రపంచంలో స్త్రీలు- ఇస్లాం మతం' అంశంపై మాట్లాడారు. పురుషాధిక్యత ఇస్లాం మతంలో ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. ఆధునిక సమాజంలోనూ స్త్రీలు వివక్షకు గురవుతున్నారన్నారు.
ఖురాన్ బోధనలు అనుసరించడంతో పాటు ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం ముస్లింలందరూ జీవన విధానాలను మలుచుకోవాలన్నారు. అంతేగాకుండా, ఇటీవలి కాలంలో ఇస్లామోఫోబియో ( ఇస్లాం మతం పట్ల విద్వేష భావాలు ) పలు దేశాలను పట్టిపీడిస్తోందని అన్నారు. ఇది సభ్య సమాజానికి గొడ్డలిపెట్టువంటిదని చెప్పారు. ఇస్లాం మతం శాంతికి ప్రతీక అన్నారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









