వాహనదారులకు తెలంగాణ RTA గుడ్ న్యూస్
- November 09, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రవాణా శాఖ (RTA) శుభవార్త అందించింది. ఇకపై వాహనాలకు సంబంధించిన కొన్ని కీలక సేవల కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే పనులు పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా పాత వాహనాలను కొనుగోలు చేసే వారు, విక్రయించే వారికి ఉపయోగపడేలా వాహన యాజమాన్య మార్పు (Ownership Transfer) ప్రక్రియను ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. వాహనాన్ని విక్రయించే వ్యక్తి, కొనుగోలు చేసే వ్యక్తి తమ వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇరువైపుల నుంచి అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త యజమాని పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) జారీ అవుతుంది. దీంతో కార్యాలయాలకు వెళ్లే సమయం, ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సేవల్లో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది.
NOC, e-KYC సేవలు కూడా ఆన్లైన్లోనే.. నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త!
ఓనర్షిప్ ట్రాన్స్ఫర్తో పాటు ఇతర రాష్ట్రాలకు వాహనాలను తరలించే సమయంలో అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోసం కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే e-KYC వివరాలను అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని సైతం పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వాహనదారులు తమకు అవసరమైన సేవలను ఎక్కడి నుంచైనా పొందే అవకాశం ఉంటుంది. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ సదుపాయాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. అయితే ఆన్లైన్ సేవలను వినియోగించుకునే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పోర్టల్‌ను పోలిన నకిలీ వెబ్సైట్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉన్నందున గుర్తింపు లేని లింకులు, వెబ్సైట్లలో వ్యక్తిగత వివరాలు, వాహన పత్రాలు, చెల్లింపుల సమాచారం నమోదు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. అధికారిక వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారానే సేవలను పొందాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కన్ఫామ్ టికెట్ లేకుంటే వందే భారత్ ఎక్కలేరు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!
- ట్రంప్ సంచలన నిర్ణయం..
- విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన పవన్–అన్నా లెజినోవా
- యూఏఈలో వాహనాల సంఖ్యపై పరిమితి అమలు వాయిదా..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్.. యువతి అరెస్ట్..!!
- ఒమన్ డేమానియాత్ దీవుల్లో అండర్‌వాటర్ మ్యూజియం..!!
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..







