‘DNK’ ఫన్-ఫిల్డ్ ట్రైలర్
- November 10, 2026
బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘DNK’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీను కంబాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. నవంబర్ 13న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన హీరో, ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేయడంతో పాటు తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. ఈ క్రమంలో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ గర్ల్‌ఫ్రెండ్ తండ్రి అతడి ఇంటికి వచ్చి గట్టిగా హెచ్చరిస్తుంది. అప్పులు పెరిగిపోవడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో హీరో తన స్నేహితుడితో కలిసి ధనవంతుల ఇళ్లలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు వరుస దొంగతనాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, వీటి వెనుక బీహార్‌కు చెందిన ముఠా ఉందని అనుమానిస్తారు.
‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో తన ఎనర్జిటిక్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ ఈ సినిమాలో తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశంలోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. అతడి గర్ల్‌ఫ్రెండ్‌గా సుష్మిత శెట్టి అందంగా, అమాయకంగా కనిపించారు. హీరో తల్లిదండ్రులుగా అలీ, రాజిత తమ కామెడీతో మరింత వినోదాన్ని అందించారు. బబ్లూ, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్, నంద గోపాల్ కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
ప్రస్తుత యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథాంశాన్ని దర్శకుడు శ్రీను కంబాల ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్న యువత పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. కామెడీ, రొమాన్స్, దొంగతనాల నేపథ్యంలో కథను నడిపిస్తూనే ఒక మంచి సామాజిక సందేశాన్ని కూడా అందించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. భిన్నమైన అంశాలను దర్శకుడు కలిపిన విధానం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ సినిమాకు స్టైలిష్ విజువల్ అప్పీల్ తీసుకొచ్చింది. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి వినోదభరితమైన సన్నివేశాలతో పాటు దొంగతనాల సమయంలో వచ్చే ఉత్కంఠను కూడా తన సంగీతంతో చక్కగా చూపించారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైన్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
జెన్ జెడ్ యువతతో పాటు ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తున్న ‘DNK’ మంచి థియేట్రికల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు: మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: శ్రీను కంబాల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
కో-ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ
సంగీతం: సింజిత్ యెర్రమిల్లి
ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్: మహి దేరంగుల
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర గువ్వల
సీఈఓ: చెర్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ
- ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!







