దుబాయ్‌లో అద్దెదారులకు గుడ్‌న్యూస్..!!
- November 11, 2026
దుబాయ్: యూఏఈలోని దుబాయ్ అద్దెదారులకు ఊరట కలిగించే కొత్త చెల్లింపు సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇకపై ఇంటి అద్దె మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా చిన్న చిన్న వాయిదాలుగా చెల్లించే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు దుబాయ్ రెసిడెన్షియల్ సంస్థ యూఏఈకి చెందిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ Rentifyతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ సదుపాయం దుబాయ్ రెసిడెన్షియల్‌కు చెందిన 22 రెసిడెన్షియల్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న అర్హులైన కొత్త, ఇప్పటికే ఉంటున్న అద్దెదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ కమ్యూనిటీల్లో 146,000 మందికి పైగా నివసిస్తున్నారు.
చిన్న చెల్లింపులుగా విభజించే అవకాశం
ప్రస్తుతం ఇంటి అద్దెను నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించే విధానం అమల్లో ఉన్న అద్దెదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సాధారణంగా నాలుగు వాయిదాల్లో చెల్లించాల్సిన మొదటి వాయిదా మొత్తాన్ని Rentify ద్వారా మరిన్ని చిన్న పేమెంట్ గా విభజించుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకునేవారు కూడా లీజ్ ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ఈ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
అద్దె చెల్లింపుల్లో మరింత వెసులుబాటు
పెద్ద మొత్తంలో అద్దె చెల్లించాల్సి వచ్చినప్పుడు అద్దెదారులపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని దుబాయ్ రెసిడెన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ అల్ సువైదీ తెలిపారు, అద్దె ఒప్పందాల నుంచి చెల్లింపులు, రెన్యువల్స్ వరకు అన్ని దశల్లో నివాసితులకు సులభమైన, డిజిటల్ సేవలు అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.
మొబైల్ యాప్‌లోనూ అనేక సేవలు
దుబాయ్ రెసిడెన్షియల్ డిజిటల్ సేవల్లో భాగంగా ఇప్పటికే మొబైల్ యాప్ ద్వారా పలు సదుపాయాలను అందిస్తోంది. నిర్వహణ సమస్యలపై ఫిర్యాదులు, లీజ్ ఒప్పందాల రెన్యువల్, ఇంట్లోకి ప్రవేశించే సమయంలో, ఖాళీ చేసే సమయంలో అవసరమైన సేవలు, అద్దె చెల్లింపులు, కమ్యూనిటీకి సంబంధించిన తాజా సమాచారం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!
- పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత నిబంధనలు..!!
- ఒమన్‌లో స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నం భగ్నం..!!
- ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ
- రేపటి నుంచి హైదరాబాద్ లో ‘భారత్ సమ్మిట్’
- వైజాగ్ వేదికగా అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీ రుణాలు..!!







