కువైట్‌లో బస్సుల వినియోగంపై రవాణా సంస్థలకు హెచ్చరిక..!!
- November 11, 2026
కువైట్: అనుమతి పొందిన లైసెన్స్ పరిధిని దాటి బస్సులను రవాణా లేదా అద్దె సేవలకు వినియోగించవద్దని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) రవాణా సంస్థలు, వ్యక్తులను హెచ్చరించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, ప్రజలు లైసెన్స్ పొందిన బస్సు అద్దె సంస్థల సేవలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది.
అలాగే సంబంధిత సంస్థతో పాటు, రవాణాకు ఉపయోగించే బస్సుకు కూడా అందిస్తున్న సేవకు అవసరమైన అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరింది. ముఖ్యంగా కార్మికులను తరలించేందుకు, పాఠశాల విద్యార్థులను రవాణా చేసేందుకు ఉపయోగించే బస్సులకు ఆయా సేవలకు సంబంధించిన ప్రత్యేక అనుమతులు తప్పనిసరిగా ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా ప్రజల భద్రతను కాపాడటంతో పాటు, సంబంధిత సంస్థలు, ప్రయాణికుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- పరువు నష్టం కేసులపై లులు గ్రూప్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో సివిల్ ఐడీ కార్డుల హోం డెలివరీ సేవలు పునఃప్రారంభం..!!
- సముద్ర రవాణాకు ముప్పు చర్యలను వెంటనే నిలిపివేయాలి: సౌదీ
- ఖతార్‌లో 0 నుంచి 3 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేక విద్యా పాఠ్యప్రణాళిక..!!
- పిల్లల సోషల్ మీడియా వినియోగంపై వయసు ఆధారిత నిబంధనలు..!!
- ఒమన్‌లో స్టార్‌లింక్ పరికరాల అక్రమ రవాణా యత్నం భగ్నం..!!
- ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక జారీ
- రేపటి నుంచి హైదరాబాద్ లో ‘భారత్ సమ్మిట్’
- వైజాగ్ వేదికగా అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తక్కువ వడ్డీ రుణాలు..!!







