ఖతార్‌లో రిటైల్ దుకాణాలకు కీలక ఆదేశాలు..!!

- November 11, 2026 , by Maagulf
ఖతార్‌లో రిటైల్ దుకాణాలకు కీలక ఆదేశాలు..!!

దోహా: ఖతార్‌లోని రిటైల్ దుకాణాలు తమ వద్ద ఆమోదించే డిస్కౌంట్ కార్డుల జాబితాను చెక్‌అవుట్ కౌంటర్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ఆదేశించింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. తగ్గింపు ధరల విక్రయాలకు సంబంధించి 2018 నాటి మంత్రి నిర్ణయం నంబర్ 311 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. 

ఈ నిబంధనల ప్రకారం వాణిజ్య సంస్థలు డిస్కౌంట్లకు సంబంధించిన ప్రకటనలను వినియోగదారులకు సులభంగా కనిపించే, స్పష్టమైన ప్రదేశాల్లో ప్రదర్శించాలి. దీంతో వినియోగదారులు తమకు అందుబాటులో ఉన్న డిస్కౌంట్ల వివరాలను ముందుగానే తెలుసుకుని, కొనుగోళ్లు పూర్తిచేసే ముందు వాటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అలాగే వాణిజ్య లావాదేవీల్లో పారదర్శకత పెరగడంతో పాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com