మక్కా గ్రాండ్ మసీదులో ఉచిత సేఫ్టీ బ్రేస్‌లెట్‌లు..!!

- November 16, 2026 , by Maagulf
మక్కా గ్రాండ్ మసీదులో ఉచిత సేఫ్టీ బ్రేస్‌లెట్‌లు..!!

మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదును సందర్శించే చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల భద్రత కోసం ప్రత్యేక సేఫ్టీ బ్రేస్‌లెట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. రద్దీ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా తప్పిపోయినప్పుడు వారిని సులభంగా గుర్తించి, తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ఈ సేవ ఉపయోగపడనుంది. గ్రాండ్ మసీదు, ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ జనరల్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  

ఈ బ్రేస్‌లెట్లను విజిటర్స్ కు ఉచితంగా అందిస్తున్నారు. గెస్ట్ కేర్ సెంటర్ల ద్వారా పొందగలిగే ఈ బ్రేస్‌లెట్లపై సంబంధిత వ్యక్తిని గుర్తించేందుకు అవసరమైన వివరాలు ఉంటాయి. ఎవరైనా తమ కుటుంబ సభ్యుల నుంచి విడిపోయినప్పుడు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది బ్రేస్‌లెట్‌లోని వివరాల ఆధారంగా వారిని గుర్తించి, అవసరమైతే కుటుంబ సభ్యులను సంప్రదిస్తారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రార్థనా సమయాల్లో చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా గుర్తించేందుకు ఈ సేవ ఎంతో ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు.

విజిటర్స్ భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, అందుబాటులో ఉండే వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు. భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు ఈ సేవ దోహదపడనుందని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com