హైదరాబాద్‌లో తేజ సజ్జా నిశ్చితార్థం..హాజరైన ప్రముఖులు
- November 16, 2026
హైదరాబాద్: ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెబుతూ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
తరలివచ్చిన సినీ, రాజకీయ దిగ్గజాలు
తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ ప్రముఖుల్లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు విచ్చేయగా.. సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తదితరులు సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్లో ఉదయ్‌పూర్‌లో వివాహం..
వచ్చే డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తేజ సజ్జా వివాహం జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించనున్నారు. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో స్నేహితులు, సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, తేజ వివాహం చేసుకోబోయే అమ్మాయి వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అయితే, ఆమె అమెరికాలో పెరిగారని, ఐటీ రంగంలో వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అని సన్నిహిత వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు షేక్ నహ్యాన్‌కు మంత్రి అజారుద్దీన్ ఆహ్వానం
- విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం
- ఖతార్ పాఠశాలల్లో వేధింపులకు చెక్..!!
- ఒమన్‌లో కొత్త ఆరోగ్య సముదాయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కా గ్రాండ్ మసీదులో ఉచిత సేఫ్టీ బ్రేస్లెట్లు..!!
- యూఏఈలో 2027లో తగ్గనున్న కొత్త నియామకాలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల చేపల విక్రయాలపై నిషేధం..!!
- బహ్రెయిన్‌లో హౌసింగ్ ఫైనాన్సింగ్‌కు భారీ స్పందన..!!
- సౌదీ అరేబియాలో బోస్ స్పీకర్లు రీకాల్..!!







