మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూ హితిన్ క్యాతో భేటీ
- August 29, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూ హితిన్ క్యాతో భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మోదీ, క్యా సమావేశమై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మయన్మార్‌లో ప్రముఖ ఉద్యమకారిణి అంగ్‌శాన్ సూచీకి చెందిన నేషనల్ లీగ్ పార్టీ చారిత్రక విజయం సొంతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి భారత్, మయన్మార్‌ల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, వాణిజ్యం పెట్టుబడుల రంగానికి సంబంధించి, మయన్మార్ 1600కి.మీ.ల సరిహద్దు రక్షణ గురించి... తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హితిన్ క్యా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇదే తొలి విదేశీ పర్యటన.సతీమణితో కలిసి వచ్చిన హితిన్ క్యా నిన్న గయలో మహాబోధి ఆలయాన్ని, ఈరోజు ఉదయం ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్‌ను సందర్శించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







