సౌదీ అరేబియాకు వెళ్ళే ఇండిగో విమానాలు Nov 30 వరకు రద్దు

- November 19, 2026 , by Maagulf
సౌదీ అరేబియాకు వెళ్ళే ఇండిగో విమానాలు Nov 30 వరకు రద్దు

యెమెన్‌లో సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు,ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకోవడం అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణి, డ్రోన్ దాడులను ముమ్మరం చేయడంతో భద్రతా కారణాల దృష్ట్యా భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసుల నిలిపివేతను పొడిగించాయి. దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో సౌదీ అరేబియాకు వెళ్లే విమానాల రద్దును మరింత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించగా.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా కొన్ని కీలక సౌదీ మార్గాల్లో తమ సర్వీసుల నిలిపివేతను కొనసాగిస్తున్నాయి.

ముఖ్యంగా అక్టోబర్ 10న రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయ విమానయాన సంస్థలను ఆందోళనకు గురిచేసింది. విమానాశ్రయాలతో పాటు ఓడరేవులు, చమురు శుద్ధి కేంద్రాలపైనా దాడులు జరుగుతుండటంతో పలు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ సౌదీకి తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ATF పన్ను పెంపు ప్రభావం ఏంటి? నవంబర్ నెలలోనూ సౌదీలో భద్రతా పరిస్థితులు అత్యంత అస్థిరంగా కొనసాగుతున్నాయి. నవంబర్ 8న రాజధాని రియాద్‌లోని ప్రభుత్వ చమురు దిగ్గజం సౌదీ అరామ్కో పరిపాలనా భవనంపై జరిగిన దాడి ప్రయత్నాన్ని అడ్డుకున్నప్పటికీ, కూల్చివేసిన క్షిపణి శకలాలు పడి భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com