సౌదీ అరేబియాకు వెళ్ళే ఇండిగో విమానాలు Nov 30 వరకు రద్దు
- November 19, 2026
యెమెన్‌లో సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు,ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకోవడం అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణి, డ్రోన్ దాడులను ముమ్మరం చేయడంతో భద్రతా కారణాల దృష్ట్యా భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసుల నిలిపివేతను పొడిగించాయి. దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో సౌదీ అరేబియాకు వెళ్లే విమానాల రద్దును మరింత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించగా.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా కొన్ని కీలక సౌదీ మార్గాల్లో తమ సర్వీసుల నిలిపివేతను కొనసాగిస్తున్నాయి.
ముఖ్యంగా అక్టోబర్ 10న రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయ విమానయాన సంస్థలను ఆందోళనకు గురిచేసింది. విమానాశ్రయాలతో పాటు ఓడరేవులు, చమురు శుద్ధి కేంద్రాలపైనా దాడులు జరుగుతుండటంతో పలు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ సౌదీకి తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ATF పన్ను పెంపు ప్రభావం ఏంటి? నవంబర్ నెలలోనూ సౌదీలో భద్రతా పరిస్థితులు అత్యంత అస్థిరంగా కొనసాగుతున్నాయి. నవంబర్ 8న రాజధాని రియాద్‌లోని ప్రభుత్వ చమురు దిగ్గజం సౌదీ అరామ్కో పరిపాలనా భవనంపై జరిగిన దాడి ప్రయత్నాన్ని అడ్డుకున్నప్పటికీ, కూల్చివేసిన క్షిపణి శకలాలు పడి భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!
- రియాద్‌లో మరో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- ఖతార్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!!
- విశాఖ–తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు
- సౌదీ అరేబియాకు వెళ్ళే ఇండిగో విమానాలు Nov 30 వరకు రద్దు
- నేడు తొలిసారిగా త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్న ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్







