రియాద్‌లో మరో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- November 19, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో పచ్చదనాన్ని పెంచడం, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా మరో 25 కొత్త పార్కులను ప్రారంభించారు. 2026లో రియాద్ మున్సిపాలిటీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఈ పార్కులను రియాద్ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ ప్రారంభించారు. రియాద్‌లోని ఖసర్ అల్ హుక్మ్లో నిర్వహించిన కార్యక్రమంలో రియాద్ మేయర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అయ్యాఫ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో పచ్చని ప్రదేశాలను విస్తరించడం, పట్టణ సుందరీకరణ, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
2021 నుంచి ఇప్పటివరకు రియాద్ మున్సిపాలిటీ మొత్తం 144 పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. నగర అభివృద్ధికి సౌదీ నాయకత్వం అందిస్తున్న మద్దతును ప్రిన్స్ ఫైసల్ ప్రశంసించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్కులు, ఇతర ప్రజా సౌకర్యాలను నిరంతరం అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. నగర విస్తరణకు అనుగుణంగా పచ్చదనాన్ని పెంచుతూ, సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!
- రియాద్‌లో మరో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- ఖతార్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!!
- విశాఖ–తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు
- సౌదీ అరేబియాకు వెళ్ళే ఇండిగో విమానాలు Nov 30 వరకు రద్దు
- నేడు తొలిసారిగా త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్న ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్







