సినిమా రివ్యూ: ‘ఈ ఎన్ ఈ రిపీట్’!

- November 19, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఈ ఎన్ ఈ రిపీట్’!

తరుణ్ భాస్కర్ అండ్ గ్యాంగ్‌తో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ సినిమా కన్నా.. ఆ సినిమా టైటిల్‌తో వచ్చిన మీమ్స్, ట్రెండింగ్ డైలాగ్సే ఇంకా ఎక్కువ పాపులర్. చాలా కాలం తర్వాత మళ్లీ  ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాడు తన సేమ్ గ్యాంగ్‌తో తరుణ్ భాస్కర్. మరి, ఆ స్థాయిలో ఈ గ్యాంగ్ సీక్వెన్స్ మూవీ ప్రేక్షకుల్ని అలరించిందా.? లేదా తెలియాలంటే ‘ఈ నగారానికి ఏమైంది రిపీట్’ కథలోకి వెళ్లాల్సిందే.!
 
కథ:
చిన్నతనం నుంచీ సినిమా తెరకెక్కించాలన్న కలతో వుంటారు నలగురు స్నేహితులు ‘వివేక్ (విశ్వక్‌సేన్), కార్తీక్ (శీనాధ్ మాగంటి), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉప్పు (వెంకటేష్ కకునూరు). ఎలాగో కష్టపడి ఓ సినిమా తెరకెక్కించి అది ఫ్లాప్ అవ్వడంతో వీళ్లు అప్పుల పాలవుతారు. మరోవైపు కీర్తన (శివాత్మిక రాజశేఖర్) ఇష్టం లేకుండా తండ్రి ఫోర్స్‌తో డాక్టర్ కోర్సులో చేరుతుంది. కానీ, అక్కడ ఇమడలేక, తండ్రి (ప్రియదర్శిని రామ్)కి తెలియకుండా తనకిష్టమైన సినిమాటోగ్రఫీ నేర్చుకోవడానికి వివేక్ అండ్ టీమ్‌లో జాయిన్ అవుతుంది. అక్కడ సినిమాటోగ్రఫర్ అయిన కార్తీక్‌ని కీర్తన లవ్ చేస్తుంటుంది. కరెక్ట్‌గా తన లవ్ ప్రపోజ్ చేసే టైమ్‌కి కీర్తనకు పెళ్లి ఫిక్సవుతుంది అంకిత్ (శ్రీరామ చంద్ర)తో. ఆ పార్టీకి అటెండ్ అయిన నలుగురు మిత్రులు కూడా ఈ బ్యాచ్‌లర్ పార్టీకి అటెండ్ అవుతారు. అనుకోకుండా ఈ పార్టీలో జరిగిన ఓ గొడవ కారణంగా అంకిత్ తన మ్యారేజ్‌ని క్యాన్సిల్ చేసుకుంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న కీర్తన తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటీ.? ఈ నలుగురు మిత్రులకు ఆయన పెట్టిన ఆ కండిషన్ ఏంటీ.? సక్సెస్ అయ్యేలా ఈ నలుగురూ ఓ మంచి సినిమా మళ్లీ తెరకెక్కించారా.? లేదా.? కీర్తనతో కార్తీక్ పెళ్లి జరిగిందా.? లేదా.? ఇవన్నీ తెలియాలంటే ‘ఈఎన్ఈ రిపీట్’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
ఈ సినిమాకి మెయిన్ బలం అభినవ్ గోమటం అని చెప్పొచ్చు. మ్యాగ్జిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ తనదే. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ ఓకే. కార్తీక్‌గా శ్రీనాధ్ కూడా జస్ట్ ఓకే. వెంకటేష్ కకునూరు తనదైన శైలి నవ్వులు పండిస్తాడు. సెకండాఫ్‌లో వచ్చిన మహేష్, రాబిన్ పాత్రలో బాగానే నవ్వులు పూయిస్తాడు. శివాత్మిక అలాగే, అనీషా అందంగా కనిపించారు. పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ప్రియదర్శిని రామ్, తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
తరుణ్ భాస్కర్ అంటే విశ్వక్ సేన్.. విశ్వక్ సేన్ అంటే తరుణ్ భాస్కర్ అనేలా తనను తాను తెరపై కనిపించకపోయినా తానే అంతా అన్నట్లుగా అనిపిస్తాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొత్త కథేమీ లేకపోయినా, అలా అలా కథనాన్ని నడిపించేశాడు. అక్కడక్కడా నవ్వులు, స్నేహితుల మధ్య బాండింగ్.. వారి మధ్య నడిచే కథనంతో పుట్టే కామెడీ.. ఇవే  ఈ సినిమాకి ప్రధాన వస్తువులు. అయితే, చాలా చోట్ల ఆ కామెడీ తేలిపోయిందనుకోండి. పబ్‌లో ఓ ఫైట్ బాగుంటుంది. కారులో కూర్చుని తాగే సీన్.. అలాగే రాజీవ్ కనకాల సన్నివేశాలు.. బాగుంటాయ్. కథలో విషయం ఏమీ లేకున్నా.. తనదైన బ్రిలియంట్ టాలెంట్‌తో కథనాన్ని డ్రైవ్ చేసి సినిమాని కంప్లీట్ చేశాడు తరుణ్ భాస్కర్. అందుకు మెచ్చుకోవాలి. అలాగే సినిమాకి సినిమాటోగ్రఫీ పెద్ద ప్లస్. తక్కువ ఖర్చుతోనే రిచ్ అప్పియరెన్స్ చూపించారు. డైలాగ్స్‌కి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా పంచ్ డైలాగ్స్ బాగా పేలాయ్. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. బీజీఎమ్ కూడా బాగుంది. టోటల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ గుడ్. 

ప్లస్ పాయింట్స్:
అభినవ్ గోమటం పర్‌పామెన్స్, క్లైమాక్స్ 15 నిమిషాలు, అక్కడక్కడా పండిన నవ్వులు.. 

మైనస్ పాయింట్స్:
కథ, సెకండాఫ్‌లో కాస్త సాగతీతలా అనిపించిన సన్నివేశాలు, 

చివరిగా:
‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’..ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఏదో టైమ్ పాస్ అనుకునేవారికి ఈ నలుగురు మిత్రులు బాగానే నవ్విస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com