రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హౌతీ మిలిటెంట్ల దాడి..

- November 19, 2026 , by Maagulf
రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హౌతీ మిలిటెంట్ల దాడి..

రియాద్: రియాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఓ టవర్‌పై హౌతీ మిలిటెంట్లు ఉగ్రదాడికి పాల్పడినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దాడిలో భవనంలోని పలు అంతస్తులతో పాటు సమీపంలోని ఇతర భవనాలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.

గురువారం (నవంబర్ 19) రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ టవర్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలిటెంట్లు దాడికి పాల్పడినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ దాడి కారణంగా టవర్‌లోని పలు అంతస్తులకు, సమీపంలోని భవనాలకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ప్రాణనష్టం కూడా సంభవించలేదని సౌదీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో రియాద్‌లో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com