#RaPo23 ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ ప్రీ-లుక్ రిలీజ్

- November 19, 2026 , by Maagulf
#RaPo23 ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ ప్రీ-లుక్ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #RaPo23 ప్రీ-లుక్‌ను ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌ తో ఇంటర్నేషనల్ మెన్‌స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ సినిమా కథ, రామ్ పాత్రపై క్యూరియాసిటీ పెంచుతోంది.

ప్రీ-లుక్ పోస్టర్‌లో రామ్ చాలా మిస్టీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. భారీ నిర్మాణంతో ఉన్న ఓ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్‌లో మెట్లపై కెమెరాకు వెనుకవైపు తిరిగి నిలబడి ఉన్నారు. బ్లాక్ డ్రెస్‌లో, వెనుక భాగంలో V ఆకారంలో చిన్నగా కట్ చేసిన హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు. తల వెనుక భాగంలో ఉన్న ప్రత్యేకమైన టాటూ ఆయన లుక్‌కు మరింత రఫ్‌నెస్ తీసుకొచ్చింది. ఒక చేతిలో గన్, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని ఉండటం ఆసక్తికరంగా ఉంది. గన్, టెడ్డీ బేర్ మధ్య ఉన్న ఈ కాంట్రాస్ట్ ఆయన పాత్రలోని మరో కోణంపై ఆసక్తిని పెంచుతోంది. భారీ జామెట్రిక్ నిర్మాణాలు, గ్రే కలర్ బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ లుక్‌ను ఇచ్చాయి.

ఈ సినిమాలోని ప్రధాన పాత్రను పరిచయం చేస్తూ ‘లోన్ వుల్ఫ్’ అనే పదానికి మేకర్స్ ఓ ఆసక్తికరమైన నిర్వచనం కూడా ఇచ్చారు. “తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి” అనేది దాని అర్థం. వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, తనదైన ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లే వ్యక్తి చుట్టూ ఈ కథ సాగనుందని ఈ కాన్సెప్ట్ సూచిస్తోంది. ఇది ఇంటెన్స్, క్యారెక్టర్ డ్రివెన్ కథగా ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తోంది.

ఇంటర్నేషనల్ మెన్‌స్ డే సందర్భంగా ఈ ప్రీ-లుక్‌ను రిలీజ్ చేయడం కూడా ప్రత్యేకతను తీసుకొచ్చింది. జనాలకు భిన్నంగా తనదైన దారిలో నడుస్తూ, తన నమ్మకాల కోసం నిలబడే వ్యక్తి స్వభావాన్ని ‘లోన్ వుల్ఫ్’ ఫిలాసఫీ ప్రతిబింబిస్తోంది. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుండటం కూడా ఈ కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా అనిపిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌ను రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిరు ) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం విడుదలైన ప్రీ-లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. రామ్ దర్శకుడిగా మారడం, ‘లోన్ వుల్ఫ్’ చుట్టూ అల్లుకున్న మిస్టీరియస్ ప్రపంచం #RaPo23ను ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుపుతున్నాయి.

నటీనటులు: రామ్ పోతినేని, రితేష్ దేశ్‌ముఖ్, సంయుక్త

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: రామ్ పోతినేని
నిర్మాత: కృష్ణ పోతినేని
బ్యానర్: రాపో సినిమాటిక్స్
సినిమాటోగ్రఫీ:  తిరు
ఫైట్స్: పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com