‘భోగి’ నవంబర్ 27న వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
- November 20, 2026
చార్మింగ్ స్టార్ శర్వా పూర్తిగా రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మరో 10 రోజుల్లో, నవంబర్ 27న ‘భోగి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. డిసెంబర్, జనవరి నెలల్లో సినిమాల రిలీజ్‌ల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఈ సినిమాకు నవంబర్ 27 సరైన రిలీజ్ డేట్. సెన్సార్ సమస్యల కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే.
‘భోగి’ సినిమాలో శర్వా గంగా పాత్రలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. పాత్రలోని ఇంటెన్స్ చూపించడానికి శర్వా తన లుక్‌తో పాటు ఫిజికల్ కూడా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు . అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, సినిమాలో మరికొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అప్పటి కాలం నాటి వాతావరణాన్ని, కుటుంబ భావోద్వేగాలతో కూడిన డ్రామాను, హై ఇంటెన్సిటీ యాక్షన్‌ను కలిపి ‘భోగి’ని రూపొందిస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడటంతో మేకర్స్ ఫైనల్ ఫేజ్ ప్రమోషన్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
నటీనటులు:
చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కిశోర్ కుమార్ అరోకియా
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..
- విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్!!
- రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హౌతీ మిలిటెంట్ల దాడి..
- పేదరికం పై భారత్ విజయం: ప్రధాని మోదీ
- దుబాయ్‌లో ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు..
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!







