కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- November 20, 2026
కువైట్ : కువైట్‌లోని జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన 494 భవనాలను కూల్చివేయాలని కువైట్ మున్సిపాలిటీ ఆదేశించింది. ఈ భవనాల యజమానులు అధికారిక గెజిట్‌లో నిర్ణయం ప్రచురితమైన తేదీ నుంచి రెండు వారాల్లోగా కూల్చివేత పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మనాల్ అల్ అస్ఫూర్ ఈ మేరకు పరిపాలనా నిర్ణయం జారీ చేశారు.
పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ తనిఖీ, నాణ్యత నియంత్రణ, పరిశోధన కేంద్రం నిర్వహించిన తనిఖీల్లో ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నట్లు గుర్తించారు. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని, వీటి వల్ల నివాసితులు, పాదచారులు, సమీపంలోని ఇతర భవనాలకు ముప్పు పొంచి ఉందని తనిఖీ నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భవనాల యజమానులు నిర్ణీత గడువులోగా వాటిని తొలగించాలని మున్సిపాలిటీ ఆదేశించింది. గడువులోగా కూల్చివేతలు చేపట్టని పక్షంలో అధికారులు స్వయంగా చర్యలు తీసుకుంటారు. ఇందుకు అయ్యే ఖర్చును సంబంధిత భవన యజమానుల నుంచే వసూలు చేస్తారు.
అయితే కూల్చివేతకు ముందు ఆయా భవనాల్లో ఎవరూ నివసించడం లేదని, ప్రాంగణాలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయని అధికారులు నిర్ధారించుకుంటారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు కలిగించే ప్రమాదకర భవనాలను తొలగించి, జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలో భద్రతను మెరుగుపరచడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్‌లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!
- అబుదాబీ ఇంటర్నేషనల్ బోట్ షో 2026కు భారీ స్పందన..
- విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!







