దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- November 20, 2026
దుబాయ్: బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా దుబాయ్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం (నవంబర్ 20) ఒక్కరోజే గ్రాముకు Dh19 మేర పతనమయ్యాయి. దీంతో బంగారం ధరలు గత 13 నెలల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు Dh425.25గా నమోదైంది. 22 క్యారెట్ల ధర Dh393.75కు పడిపోయింది. ఈ ఏడాది తొలిసారిగా బంగారం ధరలు Dh450 దిగువన కొనసాగుతున్నాయి. ఇతర రకాల బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. 21 క్యారెట్ల బంగారం గ్రాముకు Dh377.50, 18 క్యారెట్ల బంగారం Dh323.75, 14 క్యారెట్ల బంగారం Dh252.50గా నమోదయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు భారీగా తగ్గాయి. యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయానికి స్పాట్ గోల్డ్ ధర 4.13 శాతం పడిపోయి ఔన్స్‌కు 3,528.89 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా 6.83 శాతం తగ్గి ఔన్స్‌కు 41.43 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనం ప్రభావం దుబాయ్ బంగారం మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్‌లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!
- అబుదాబీ ఇంటర్నేషనల్ బోట్ షో 2026కు భారీ స్పందన..
- విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!







