షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స

- November 20, 2026 , by Maagulf
షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స

ఆరోగ్యం నిలకడగా ఉంది..కోలుకుంటున్నారని వెల్లడించిన కుమార్తె షేఖా బోదూర్

షార్జా: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆయన కుమార్తె, షార్జా బుక్ అథారిటీ (SBA) చైర్‌పర్సన్ షేఖా బోదూర్ బింట్ సుల్తాన్ అల్ ఖాసిమి వెల్లడించారు.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసినవారికి, ఆపరేషన్ సమయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ అండగా నిలిచినవారికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

దేవుడి దయతో శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని షేఖా బోదూర్ తన సందేశంలో పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ అల్లాహ్ తగిన ప్రతిఫలం ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు.

శస్త్రచికిత్సకు ముందు కూడా షేఖా బోదూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని కోరారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, సుఖసంతోషాలు ప్రసాదించాలని, త్వరగా కుటుంబ సభ్యుల మధ్యకు ఆరోగ్యంగా తిరిగి రావాలని అల్లాహ్‌ను ప్రార్థించారు.

షార్జా పాలకుడి శస్త్రచికిత్స విజయవంతం కావడం, ఆయన కోలుకుంటున్నారన్న వార్తతో శ్రేయోభిలాషులు, ప్రజలు ఊరట చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com