2026లో కువైట్ చమురేతర రంగం 1.5% వృద్ధి..!!

- November 21, 2026 , by Maagulf
2026లో కువైట్ చమురేతర రంగం 1.5% వృద్ధి..!!

కువైట్ : కువైట్ ఆర్థిక వ్యవస్థలో చమురేతర రంగం 2026లో 1.5 శాతం వృద్ధి సాధించవచ్చని కువైట్ సెంట్రల్ బ్యాంక్ (CBK) అంచనా వేసింది. ప్రభుత్వ పెట్టుబడులు, నిరంతర ఆర్థిక కార్యకలాపాలు ఈ వృద్ధికి ప్రధానంగా దోహదపడతాయని వెల్లడించింది. అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (S&P) తాజాగా కువైట్ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌ను AA-/A-1+ వద్ద కొనసాగిస్తూ, స్థిరమైన ఔట్‌లుక్‌ను ప్రకటించింది. దేశ ఆర్థిక, ద్రవ్య పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయనడానికి ఇది నిదర్శనమని సెంట్రల్ బ్యాంక్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఆర్థిక స్థిరత్వం

సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న ద్రవ్య, పర్యవేక్షణ విధానాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తున్నాయని తెలిపింది. కువైట్ దినార్‌ను ప్రధాన వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య దేశాల కరెన్సీల బాస్కెట్‌తో అనుసంధానించిన మారకపు విధానం కూడా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంది. ఈ విధానం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తిని కాపాడటానికి దోహదపడుతోందని వివరించింది.

రుణాల పంపిణీలో వృద్ధి

2026లో కువైట్ బ్యాంకింగ్ రంగం అందించిన రుణ సదుపాయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రభుత్వ వ్యయం, పెట్టుబడులు పెరగడంతో పాటు చమురేతర ఆర్థిక కార్యకలాపాలు సానుకూలంగా కొనసాగడం ఇందుకు కారణమని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. దేశీయ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉందని వెల్లడించింది. 2026 మధ్య నాటికి బ్యాంకుల మొత్తం రుణాల్లో నిరర్థక రుణాల (Non-Performing Loans - NPLs) వాటా సుమారు 1.5 శాతంగా నమోదైందని పేర్కొంది.

బ్యాంకులపై ఇటీవల అమలు చేసిన నియంత్రణ, పర్యవేక్షణ నిబంధనల సడలింపులు భవిష్యత్తులోనూ కీలకంగా ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయపడింది. ఈ చర్యలు బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, సవాళ్లను ఎదుర్కొనేందుకు తోడ్పడతాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com